Nithya Monthly

కొత్త పాతల మేలుకయికగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు హృదయాలలో దీపికగా నిలిచిపోవాలనే లక్స్యంతో అందర్నీ పలుకరిస్తోంది..మీ నిత్య ఇ-మాసపత్రిక. ఏ తెలుగు పత్రికా ఇవ్వలేనన్ని ఎక్కువ కథలు, కవితలు, నవల, సీరియల్స్, ప్రత్యేక శీర్షికలతో పరిపూర్ణమైన సాహిత్యాన్ని అందించడమే నిత్య ధ్యేయం. పాతతరం రచయితల్ని, వారి రచనల్ని, సాహిత్య పరిమళాలను నేటి తరానికి పరిచయం చేయాలన్నది మా సంకల్పం. ఈ సంకల్పాన్ని నెరవేర్చేందుకే..ఈ పత్రికలో అపూర్వ కథ, పద్యపరిమళం, చెరగని సంతకం…ఇలాంటి ప్రత్యేక శీర్షికలు. తెలుగు ప్రజల తరతరాల చరిత్రను పరిచయం చేస్తూ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి చరిత్ర సంగతులు “కాలనాళిక”, డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ ప్రత్యేక శీర్షిక “ప్రకృతి”. సంగీతం లోతుల్ని వివరిస్తూ హరిణి ధర్భ(యూఎస్) విశ్లేషణ “సరిగమలు”…ఇలా ఒకటేమిటి..ఎన్నో ప్రత్యేకతలు..

త్వరలో ప్రారంభం కానున్న మరో ప్రత్యేక శీర్షిక ఏమిటంటే…తెలుగు నేలకు దూరంగా ఈ విశాల ప్రపంచంలో నలుదిశలకు చెదిరిపోయి పరాయి నేలపై కూడా తెలుగును పరిమళింపజేస్తూ, తెలుగు సంస్కృతీ సాహిత్యాలకు జీవంపోస్తున్న ప్రవాసాంధ్రుల రచనల కోసం ప్రత్యేకంగా “దూరతీరాలు” అనే సరికొత్త శీర్షిక.

ఎక్కడ ఉన్నా, ఎవరికివారై జీవన పయనంలో ముందుకు సాగుతున్నా తెలుగు ప్రజల హృదయ స్పందన ఒకటే..దానిని అక్షరీకరించాలన్నే మా తపన…నిత్య ద్వారా చేస్తున్న అక్షర తపస్సులో అదికూడా భాగమే…మీరు ఎక్కడ ఉన్నా మీ అరచేతిలో తెలుగుదనాన్ని ఆవిష్కరిస్తూ పలుకరించే నిత్య ఇ- మాసపత్రిక ను చదవాలంటే ఈ కింది లింక్ ను క్లిక్ చేసి వెబ్ సైట్ లో ప్రవేశించండి.

సహృదయులైన తెలుగువారందరికీ ఎలాంటి సరిహద్దులు లేకుండా ఆత్మీయంగా

నిత్య …

సాదర స్వాగతం పలుకుతోంది.

https://www.nithyamonthly.com/