పరిశోధన దృష్టితో రచనలు

పుస్తకాలపై గొడవపడటం ఎప్పటి నుంచో ఉన్నదే. ఇదేమీ కొత్త కాదు. పెండ్యాల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారని ఒక రచయిత ఉండేవారు. ఆయన 1877 లో జన్మించారు. 1950 లో తుదిశ్వాస విడిచారు. ఈయన రాసిన పుస్తకాలపై శ్రీపాద కృష్ణముర్తి శాస్త్రి గారు విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆయన గ్రంధాలలో భాషాదోషాలను శ్రీపాద వారు ఎత్తి చూపించారు. అయితే వాటిని పెండ్యాల వారు సమర్ధించుకుంటూ ఎదురు శ్రీపాద వారి గ్రంధాలలో బోలెడు తప్పులు ఉన్నాయని వెల్లడించారు.

అయితే శ్రీపాద వ ఆరు ఊరుకోలేదు. పెండ్యాల వారి పుస్తకం మీద విమర్శ రాయడమే కాకుండా కోర్టుకి వెళ్ళారు. అ పుస్తకం పేరు మహా భారత చరిత్ర. పెండ్యాల వారు ఈ పుస్తకాన్ని 1927 ప్రాంతంలో వెలువరించారు. పెండ్యాల వారు మహత్తు దృష్టితో కాకుండా ప్రకృతి దృష్టితో చూసి మహాభారత కథలోని ప్రక్రుతితత్వాన్ని విమర్శిస్తూ జరిగిన ఘటనలలో ఏది ముందో ఏది వెనుకో వివరించారు. కానీ అది శ్రీపాద వారికి తప్పై కనిపించింది.

మహాభారత విమర్శపై చర్చలు మొదలయ్యాయి. 1939 లో శిష్టా సుబ్రమణ్య శాస్త్రిగారు మహాభారత రహస్యను అనే పేరిట ఓ విమర్శ గ్రంధాన్ని అచ్చు వేసారు. అలాగే పెండ్యాల వారి గ్రంధం మీద పిఠాపురం వాస్తవ్యులు అయిన వారణాసి సుబ్రమణ్య శాస్త్రిగారు కూడా విమర్శించారు. ఆయన మహాభారత తత్వ కథనము – పాండవ నిండా నిరాకరణం అని నాలుగు సంపుటాలను తీసుకొచ్చారు.

ఆయన పుస్తకాలపై విమర్శలు ఎన్ని వచ్చినా పెండ్యాల వారు సమాధానాలు ఇస్తూ వచ్చారు. ఎక్కడా వెనక్కు తగ్గేవారు కాదు.

ఆయన చేసిన యాత్రాలపై కూడా కొన్ని అనుభవాలను కూడా చదువరుల ముందు ఉంచారు.

ఇతిహాసాలను, పురాణాలను పరిశోధన దృష్టితో ప్రకృతి దృష్టితో చూడటాన్ని ఆయన శైలిగా ఉండేది. ఆయన రచనలు జనం మధ్య ఓ విప్లవాన్ని కలుగాజేసేవిగా ఉండటం విశేషం
ఆయన గొప్ప తెలుగు పండితుడిగా ఎందరికో విద్యాబోధన చేశారు.
—————————————
జయా