నాన్నా!

ఎక్కడని వెతకను నాన్నా నిన్ను ……
పున్నమి చంద్రునిలోనా,
ప్రక్కనున్న ద్రువతారలోనా ,
ఉదయించిన సూర్యునిలోనా ,
మేల్కొన్న కలువలోనా,
వికసించిన పువ్వులలోనా,
వెదజల్లిన సువాసనలోనా,
రివ్వున వీస్తూ నన్ను తాకే మారుతం లోనా,
తాకిడిని పలుకరించే ఆకులలోనా,
తొలకరి జల్లులలోనా,
తడిసి ముద్దైన నేలలోనా,
పాడి పంటలలోనా,
నా వూరి ప్రక్రుతి లోనా,
కలలలోనా,అలలలోనా,
నా చేతి వ్రాత లోనా,
పంచ భూతాల్లోనా,
నువ్వు కని పెంచిన పంచామ్రుతాల్లోనా,
చెప్పు నాన్నా….!
నువ్వు లేని ఇన్నేళ్లు క్షణమొక యుగం.
నువ్వొక మర్చిపోలేని జ్ఞాపకం.

–సాయిరాం ఉప్పు