కీళ్ల నొప్పులకు సింపుల్ టెక్నిక్స్!

కీళ్ల నొప్పులకు సింపుల్ టెక్నిక్స్!

కీళ్ల నొప్పులు దూరం చేసే సింపుల్ టెక్నిక్స్!ఒకప్పుడు 60 ఏళ్లు దాటిన తర్వాత కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు ఇబ్బంది పెట్టేవి. కానీ ఈరోజుల్లో చిన్న వయసు నుంచే ఈ సమస్యలు స్టార్ట్‌ అవుతున్నాయి. ఈ సమస్య ఉంటే.. లేస్తే కూర్చోలేరు, కూర్చుంటే లేవలేరు. అసమతుల్య జీవనశైలి, చెడు ఆహార అలవాట్ల కారణంగా చిన్నవయసులోనే కీళ్లనొప్పుల సమస్యలు ఎదురవుతున్నాయి. వర్షాకాలంలో కీళ్ల నొప్పులు మరింత ఎక్కువగా ఉంటాయి. ఆర్థరైటిస్ సమస్య ఉంటే, ఈ నొప్పి మరింత తీవ్రంగా ఉంటుంది. ఈ సీజన్‌లో తేమ వల్ల కీళ్ల నొప్పులు మొదలవుతాయి. చల్లని వాతావరణం కీళ్లపై చాలా ఒత్తిడిని కలిగిస్తుంది. తేమ స్థాయిలు, వాతావరణ పీడనం, ఉష్ణోగ్రతలో ఆకస్మిక మార్పుల కారణంగా.. వర్షాలు ప్రారంభమైన వెంటనే చాలా మందికి కీళ్ల నొప్పులు బాధిస్తాయి. కండరాలు గట్టిపడటం వల్ల.. ఈ నొప్పులు మరింత ఎక్కువవుతాయి. మారుతున్న వాతావరణం.. కీళ్ల నొప్పులకు మధ్య సంబంధం ఉంటుందని వైద్యులు అంటున్నారు. చల్లని వాతావరణం కీళ్లపై చాలా ఒత్తిడిని కలిగిస్తుంది. తేమ ఎక్కువగా ఉంటే రక్తం చిక్కగా అవుతుంది. ధమనులలో రక్తపోటు పెరుగుతుంది. రక్తాన్ని పంపిణీ చేయడానికి శరీరం కష్టపడాల్సి ఉంటుంది. కీళ్ళ చుట్టూ ద్రవం సాంద్రత తగ్గుతుంది. దీని వల్ల నొప్పి మరింత ఎక్కువగా ఉంటుంది..ఆహారంలో కొన్ని మార్పులువర్షాకాలంలో కీళ్ల నొప్పులు ఇబ్బంది పెడుతుంటే..  ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలని  నిపుణులు చెబుతున్నారు. ఆహారంలో మెంతులు, అల్లం, పసుపును చేర్చుకోవాలి . తీపి, పులుపు, ఉప్పు రుచులను ఎక్కువగా తీసుకోవాలి. పొడిగా ఉన్నవి, చల్లని ఆహారానికి దూరంగా ఉండాలి.మసాజ్‌ కీళ్ల నొప్పులు నుంచి ఉపశనమం పొందాలంటే.. రోజూ గోరువెచ్చని నువ్వుల నూనెతో మసాజ్‌ చేసుకోండి. దీనితో పాటు, రోజూ వేడి నీటితో స్నానం చేయండి. వేడి నీటి స్నానం నొప్పుల నుంచి ఉపశమనం ఇస్తుంది.వేడిగా ఉన్న ఆహారంవర్షాకాలంలో తేమ ఎక్కువగా ఉండటం, చల్లగా ఉండడం వల్ల కీళ్ల నొప్పులు ఎక్కువగా వస్తాయి.  చల్లని ఆహారం తీసుకుంటే.. శరీరంలో వాత దోషం పెరుగుతుంది. వర్షాకాలంలో వేడి వేడి ఆహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ కాలంలో వేడి నీరు తాగితే ఆరోగ్యానికి మంచిదని అంటున్నారు. మీ ఆహారాన్ని నెయ్యి, నువ్వుల నూనెతో తయారు చేసుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.తేలికపాటి వ్యాయామంతేలికపాటి వ్యాయామం, కీళ్ల నొప్పులను తగ్గించడంలో సహాయపడుతుందని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. మెట్లను ఎక్కడం కూడా.. ఓ వ్యాయామంలా ఉంటుంది. కానీ ఎక్కువ సార్లు మెట్లు ఎక్కకుండా జాగ్రత్తపడండి. అధిక శ్రమ వల్ల కూడా కీళ్ల నొప్పులు వచ్చే అవకాశం ఉంది.