ఉత్తమ కధానిక - 'గుండె గోస'

హృదిని హత్తుకునే విధంగా కధ వ్రాయడానికి బరువైన పాత్రలు అవసరం లేదు. బలమైన, సమకాలీనమైన కధ ఉంటే చాలు. పాఠకుడు లీనమై చదవాలంటే తను కూడా కధలో ఒక పాత్రగా అన్వయించుకోవాలి.

ఈ సంవత్సరం వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు నిర్వహించిన 24వ ఉగాది రచనల పొటీలో ఉత్తమ కధానికగా తెలుగుమల్లి సంపాదకులు శ్రీ కొంచాడ మల్లికేశ్వర రావు వ్రాసిన ‘గుండె గోస’ కధ ఉత్తమ కధానికగా ఎంపిక కాబడింది. కధ మూలాల్లోకి వెళితే ఇది ఒక గిరిజన కుటుంబం కొండకోనల్లో నివసిస్తూ పిల్లల్ని చదివించి తమ ఊరిని అభివృద్ధి చేయాలన్న తపనలో ఎన్ని కష్టాలు అనుభవించారో చివరికి వారి కోరిక ఎలా తీరిందో సవివరంగా వర్ణించబడింది.

అయితే పాత్రల రూపకల్పనలో ఉత్తరాంధ్ర మాండలీకాన్ని సంభాషణల్లో ఒదిగించిన తీరు న్యాయ నిర్ణేతలను బాగా ఆకట్టుకుంది. ఆద్యంతము కధ నడిపించిన తీరు వారిని ఎంతో ఆకర్షించింది. శ్రీ వంగూరి ఫౌండేషన్ వారికి ఈ కధానికను ఉత్తమమైనదని ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు.