ఆకలి రుచెరుగదు, నిద్ర సుఖమెరుగదు

ఆకలి గొన్నవేళఅడినదేదో,దొరికినదేదో
ఆత్రముగా ఆరగించుటే గాని
రుచి పచుల బేధమెరుగ బోము,॥ ఆకలి,॥
ఉదికినదీ ఉదాకనిడీ,
ఉప్పూ,కారం,
తీపీ పులుపూలూ,ఉన్నదీ లేనిదీ చాలినదీ లేనిదీ తెలియకనే దొరికినదే
అమృఉతొపమానమై తోచు,
॥ఆకలి॥
అలనాడొక మహరాజు
అడవిలోన సైన్యమును బాసి దారి తప్పి
చేరినాడొ క పేద ముదుసలి
పూరిగుడిసె ,ఽ
అకలి దప్పుల అలమటించు,
మహారాజు సేద దీర్చి
నిరుపేద అవ్వ
పెరటిలోని గారిక దెచ్చి పచ్చడిగనూరి,
వడ్లుదంచి వరికూడు వండి
ఆదరముగా వడ్డింపగా
ఆత్రముగ కడుపార ఆరగించే,॥ఆకలి ॥
పంచభక్ష్యపరమాన్నములు
భుజించు మహారాజుకు
ఆక్షణ మున పచ్చడి మెతుకులే
అమృఉతొపమానమై ఆకలి దీర్చ,
ఆరాజు పరమానన్దమన్ది తక్షణం
ఆగ్రామమంత అవ్వకు
బహూకరించగ
ఆగ్రామమే గరికవలస నామాన
విరాజిల్లె ,
“నిద్ర సుఖమెరుగదు “
———————–.
కటికనేల పట్టుపరుపు,
పట్టెమంచం నులకమంచం
మట్టి బురదలు ఏచోటనైన ,
ఎతీరయినా సుఖమెరుగని నిద్ర
కనురెప్పల కమ్ముకు వచ్చి మత్తున ముంచు ,॥నిద్ర॥
కొరుకుచలి కాల్చే ఎండా ,వేడిలు,
ఏది ఎట్లున్నగాని
అలసిన మనసు ,బడలిన దేహములు ,
వాలిపోయి సోలిపోవు,
ఆదమరచి మగరలోన ములిగిపోవు,
॥నిద్ర॥
కలిమిలేములు,కష్టసుఖాలు,
చింతావంతలు సుఖ దుహ్కాలు
అన్నీ మరపించినలుపూ తెలుపూ
కనుపాపల మాటు న మరుగు పరచి
ఊహాలోకాల,తేలించి ,
స్వప్నసీమల విహరింప జేసి
మైకాన ముంచు,
మహిమాన్వితమే నిద్ర ,సుఖ మెరుగని నిద్ర.
———————————————————–
కామేశ్వరీ సాంబమూర్తి .భమిదిపాటి .
పి ఎ యు.ఎస్ ఎ